English | Telugu
భార్య బర్త్‌డేకి డాక్టర్ బాబు కవిగా మారాడు
Updated : May 10, 2022
బుల్లితెరపై నిరుపమ్ `కార్తీకదీపం`లోని డాక్టర్ బాబు పాత్రతో పాపులారిటీని సొంత చేసుకుని సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. బుల్లితెర శోభన్ బాబుగా అందరిచేత ప్రశంసలు పొంతుదున్న నిరుపమ్ `కార్తీక దీపం` సీరియల్ నుంచి తప్పుకున్నా ఇంకా కొత్త సీరియల్ ని ప్రారంభించలేదు. తను మళ్లీ బుల్లితెరపై ఎప్పుడు మెరుస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సీరియల్స్ లో కనిపించని డాక్టర్ బాబు సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టీవ్ గా వుంటున్నాడు. ప్రతీ అకేషన్ ని సోషల్ మీడియా వేదికగా జరుపుకుంటూ అభిమానులకు అందుబాటులో వుంటున్నాడు.
డాక్టర్ బాబు పాత్రతో పాటు వంటలక్క పాత్రని కూడా సీరియల్ నుంచి తొలగించడంతో సీరియల్ గతి తప్పి పక్కదారులు పట్టి చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతోంది. ఇదిలా వుంటే నిరుపమ్ మాత్రం సీరియల్స్ లో కనిపించకుండా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడు. భార్య మంజులతో కలిసి యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఆ చానల్ ఫేమస్ అయ్యింది.
తాజాగా నిరుపమ్ తన భార్య మంజుల పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది. పుట్టిన రోజు సందర్భంగా మంజులపై ఏకంగా ఓ కవిత రాశాడు. ఆగని అల.. కరగని కల.. అనుబంధాల వల.. తరగని నావలా... ఇది దేవుడి లీల.. హ్యాపీ బర్త్ డే మంజుల.. అని చెప్పేస్తూ కవిత రాశాడు నిరుపమ్. అతడి కవిత్వాన్ని చూసి నెటిజన్ లు మురిసిపోతూ కామెంట్ లు పెడుతున్నారు.